- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : హజ్ యాత్రకు జెండా ఊపిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం హజ్ యాత్ర(Haj Pilgrims)కు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం హజ్ యాత్ర(Haj Pilgrims)కు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌస్(Nampally Haj House)లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, యాత్రకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో ఆయన హజ్ యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో రవాణా, వసతి, వైద్య సహాయం వంటి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
2025 హజ్ యాత్ర కోసం తెలంగాణ నుంచి సుమారు 4,200 మంది యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్ హైదరాబాద్ ద్వారా సౌదీ అరేబియా(Hyderabad to Soudi Arebia)కు బయలుదేరుతున్నారు. వీరు జూన్ 10 నుంచి జులై 10 మధ్య మక్కా(Mecca), మదీనా(Medina)లో హజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, హజ్ కమిటీ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యాత్రికులు హైదరాబాద్ నుంచి జెడ్డా, మదీనా విమానాల ద్వారా యాత్రను కొనసాగిస్తారు.






