ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-07 12:01:43  IST  )

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించిన బంద్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. విడతల వారిగా నిధులు విడుదల చేస్తామని, విద్యార్థుల‌ను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేద‌న్నారు.

ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించిన బంద్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. విడతల వారిగా నిధులు విడుదల చేస్తామని, విద్యార్థుల‌ను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేద‌న్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పారు. విద్య‌ను వ్యాపారం చేస్తే ఊరుకునేది లేద‌న్నారు. విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లాడితే క‌ళాశాల‌లైనా, రాజ‌కీయ పార్టీలైనా ఉపేక్షించేది లేద‌న్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు… అంతకు ముందు ఈ సమస్య లేనట్టు మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్లం కాదన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చ‌రించారు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని ఆరోపించారు. అరోరా కాలేజీ రమేష్‌కి ఎన్ని అనుమతులు ఇవ్వాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్‌ చేశారన్నారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామ‌ని అన్నారు. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా? అని ప్ర‌శ్నించారు.

Next Story