రేవంత్ vs కేటీఆర్.. అసెంబ్లీలో యుద్ధ వాతావరణం

by Gantepaka Srikanth |

కులగణనపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా యుద్ధ వాతావరణం కనిపించింది.

రేవంత్ vs కేటీఆర్.. అసెంబ్లీలో యుద్ధ వాతావరణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులగణనపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా యుద్ధ వాతావరణం కనిపించింది. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే.. ఇప్పుడు బీసీల లెక్కను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. 2014లో చేపట్టిన సర్వే రిపోర్టును వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టామని.. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో ఉన్న రిపోర్టు అదేనని చెప్పారు. అప్పటికి ఇప్పటికి బీసీల జనాభాను 5 శాతం తగ్గించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోయిందన్నారు. తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కాగా.. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

నాడు ఊరు పేరు తెలియని వారితో సర్వేను నిర్వహించారని అన్నారు. కేవలం రికార్డు కోసమే సర్వేను చేపట్టారని అన్నారు. సర్వే రిపోర్టుపై కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. అర్థం పర్థం లేని మాటలతో ప్రయోజనం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరారు. వీళ్లు చెబుతున్న రిపోర్టు అఫీషియల్ వెబ్‌సైట్‌లో లేదని అన్నారు. నాడు సర్వే చేసిన ఎన్యుమరేటర్లు ఎవరు..? అని వివరాలు వెల్లడించారా అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు ఉండడంతో కులగణన రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని వివరించారు. బీసీలకు న్యాయం చేయాలని చూస్తుంటే ఇన్ని విమర్శలా అని అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు.

Next Story