- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
State Election Commission :ఏకగ్రీవంపై సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఈసీ!

దిశ, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)లో ఏకగ్రీవాల(Unanimous)కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission)ల ఆలోచన(Thoughts)ల మధ్య పరస్పర భిన్న వైఖరు(Differenses)లు హాట్ టాపిక్ గా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని..వీలైనంత ఎక్కువ స్థానాలు ఏకగ్రీవాలు చేయాలంటూ ఇటీవల జరిగిన ఎమ్మెల్మేల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఏకగ్రీవాల ప్రక్రియకు ఎన్నికల సంఘం చెక్ పెట్టే దిశగా నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు అధికార పార్టీలో అలజడి రేపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా.. నోటాను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలలో అమల్లో ఉందని..తెలంగాణ రాష్ట్రంలోనూ ఏకగ్రీవాలకు నోటాతో చెక్ పెట్టాలని ఈసీ భావిస్తుంది. ఏకగ్రీవాలపై నిర్ణయానికి సంబంధించి ఈనెల 12న రాజకీయ పార్టీలతో జరిగే సమావేశంలో చర్చించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం ప్రతిపాదనలకు రాజకీయ పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏకగ్రీవాల నివారణకు పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశంతో ఎన్నిక నిర్వహిస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలు సాధించేందుకు అధికార, ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నించనున్నాయి. ఈ క్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ స్థానాలు ఎక్కువగా ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామాల్లో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తాయి. ఇందుకోసం వేలం పాటలు సైతం నిర్వహిస్తున్నారు. నామినేషన్లు వేసిన వారిని, అసంతృప్తులను బుజ్జగించి, పోటీ నుంచి తప్పించడం జరుగుతోంది. ప్రభుత్వాలు సైతం ఏకగ్రీవం చేసుకున్న పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున ఇస్తామని నజరానా ప్రకటించాయి. ఆ నిధులతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని ఆశించి ఏకగ్రీవం ఎన్నికలకు మొగ్గుచూపేవారు.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇస్తామన్న ఏకగ్రీవం నజరానాలు ఎగవేయడంతో ఏకగ్రీవాలపై పార్టీల నుంచి నిరసన కూడా వ్యక్తమైంది. 2019స్థానిక సంస్థల ఎన్నికల్లో 16శాతం సర్పంచ్ లు, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం గమనార్హం. అయితే ఏకగ్రీవాలు అప్రజాస్వామికమని..బలవంతులు, ధనవంతులు ఏకగ్రీవం పేరిట ఎన్నికవుతున్నారని..ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకగ్రీవ విధానాలకు చెక్ పెట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో నోటాతో ఏకగ్రీవాలకు చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తుంది.