కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఆదివారం రామ్మోహన్ కుమారుడు శివన్ ఎర్రన్నాయుడు బారసాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివన్ ఎర్రన్నాయుడిని ఆశీర్వదించిన రేవంత్.. అనంతరం అక్కడే ఉన్న పలువురు ఏపీ నాయకులతో కరచాలనం చేస్తూ.. ముచ్చటించారు. సీసీ అధ్యక్షుల ఎంపికపై హైకమాండ్‌తో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ మరికొద్దిసేపట్లో హైదరాబాద్ తిరిగి రానున్నారు.

డీసీసీల ఎంపికపై తమ అభిప్రాయాలను పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌, సీఎం రేవంత్‌ అధిష్టానానికి వెల్లడించారు. కాగా డీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈనెల 30, 31వ తేదీల్లో, అలాగే నవంబర్ 4, 5వ తేదీల్లో రెండవ విడత ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.

Next Story