- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగుళూరులో మల్లికార్జున ఖర్జేను పరామర్శించిన సీఎం రేవంత్.. పలు కీలక అంశాలపై చర్చలు..!
బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం కర్ణాటకకు వెళ్లారు. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బెంగళూరు (Bengaluru)లోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో (MS Ramaiah Hospital) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election), స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేను కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘ఇటీవల అనారోగ్యానికి గురై పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని, బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని పరామర్శించాను. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.






