- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజ్మీర్ షరీఫ్ దర్గాకు CM రేవంత్ రెడ్డి
అజ్మీర్ షరీఫ్ దర్గాకు CM రేవంత్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చాదర్ సమర్పించారు. ముఖ్యమంత్రి వెంట.. మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, TMREIS వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబనీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముస్లిం మైనారిటీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నేతలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యులర్ సీఎం అని, అన్ని మతాలను సమానంగా చూస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం రేవంత్ రెడ్డి అజ్మీర్ దర్గాకు చాదర్‌ను సమర్పిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అజ్మీర్ దర్గాలో రుబాత్‌ను నిర్మించిందని చెప్పారు.






