CM Revanthi Reddy : సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమం(Sabarmati Ashram) సందర్శించారు.

CM Revanthi Reddy : సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమం(Sabarmati Ashram) సందర్శించారు. జాతిపిత మహాత్మ గాంధీ(Mahathma Gandhi)కి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను సీఎం అక్కడి నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగే రెండు రోజుల AICC ప్రత్యేక కార్యక్రమాలు, CWC సమావేశాల కోసం సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మహాత్మాగాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన సబర్మతీ ఆశ్రమాన్ని విజిట్ చేశారు.

Next Story