- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక 'వోట్ చోరీ'పై ప్రజల్లోకి వెళ్లనున్న కాంగ్రెస్
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోసహా కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ, మంత్రులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎమ్మెల్యేల అనర్హత అంశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీజేపీ, ఈసీల 'వోట్ చోరీ' అంశంపై ముఖ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై 'వోట్ చోరీ' అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు నేటి సభలో 'వోట్ చోరీ' ప్రచార లోగోను సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఆవిష్కరించారు. 'వోట్ చోరీ' అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో, పట్టణాల్లో దీనిపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు పేర్కొన్నారు.






