- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు.. మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో గురుకుల విద్యార్థులు! : సీఎం రేవంత్
‘ది గోట్ ఇండియా టూర్’ అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ది గోట్ ఇండియా టూర్’ లో భాగంగా అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి సందడి చేసిన విషయం తెలిసిందే. గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సింగరేణి ఆర్‌ఆర్9, అపర్ణ మెస్సీ జట్ల పేరుతో ఈ మ్యాచ్ జరిగింది. అయితే సింగరేణి ఆర్ఆర్9 టీమ్‌లో సీఎంతో పాటు పాల్గొన్న మిగితా ప్లేయర్స్.. సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అవకాశం కల్పిస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారు అన్నది నా ప్రగాఢ విశ్వాసం అని తెలిపారు. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఫ్రెండ్లీ ఫైట్ లో తలపడి, తెలంగాణ ప్రైడ్‌కు ప్రతీకలుగా నిలిచిన ఈ యువ సోదరులకు నా అభినందనలు.. అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే స్థాయికి మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






