ఫుట్‌బాల్ అభిమానులకి అదిరిపోయే క్షణం! మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-11-28 11:29:51  IST  )

అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజ క్రిడాకారుడు లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్‌ నగరానికి రానున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఫుట్‌బాల్ అభిమానులకి అదిరిపోయే క్షణం! మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజ క్రిడాకారుడు లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్‌ నగరానికి రానున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 13న మెస్సీ నగర పర్యటనకు సిద్ధమైన నేపథ్యంలో, ఆయన రాకపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘మన నగరానికి ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడు రాబోతున్న క్షణం ప్రతి అభిమానికీ మరపురానిది. హైదరాబాద్ అతని స్వాగతానికి సిద్ధంగా ఉంది. మన ప్రజల ఉత్సాహం, స్పూర్తి, ఆతిథ్యమే మన ప్రత్యేకత’ అని సీఎం తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మెస్సీని ఆత్మీయంగా స్వాగతించేందుకు హైదరాబాద్‌‌ సిద్ధమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story