- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మేడారానికి సీఎం రేవంత్.. పర్యటన షెడ్యూల్ ఇదే
సీఎం రేవంత్ రెడ్డి నేడు మేడారంలో పర్యటించనున్నారు. సాయంత్ర 4.30 గంటలకు సీఎం మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు మేడారంలో పర్యటించనున్నారు. సాయంత్ర 4.30 గంటలకు సీఎం మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. 6.30 గంటలకు మేడారం అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. నేడు రాత్రి సీఎం మేడారంలోని హరిత హోటల్ లోనే బస చేస్తారు. ఇక రేపు ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించి మొక్కులు చెల్లించుకుంటారు. నేడు సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ సైతం వెళ్లనున్నారు. ఇక సీఎం, మంత్రులు మేడారంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు.
Read More..
మేడారం జాతరకు భారీగా తరలిరానున్న భక్తులు.. అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు
Next Story






