- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ.. నేడు సీఎం శంకుస్థాపన
హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది.
ప్రపంచ బ్యాంకు, జైకా సంస్థలు
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు, జ పాన్ సహకార సంస్థ (జైకా) వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములవనున్నాయి. దేశంలో మొదటి నెట్-జీరో స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 15 వేల ఎకరాల సిటీ ఏరియాతోపాటు దానికి ఆనుకొని ఉన్న 15 వేల ఎక రాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీన్ లంగ్స్‌గా పని చేయ నుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్‌లతో పాటు వాట ర్ రీసైక్లింగ్, జీరో-డిశ్చార్జ్ ఉండేలా పర్యావరణ హిత న గరంగా తీర్చిదిద్దనున్నారు.
లైవ్, లెర్న్, వర్క్, ప్లే
‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’ కాన్సెప్ట్‌తో ఈ సిటీ అభివృద్ధి చే యాలని నిర్ణయించారు. ఇక్కడ పరిశ్రమలతోపాటు స్కూ ళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్‌లో ఉండేలా ప్లాన్ చేశారు. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్-బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్‌టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమివ్వటం రాబోయే శతాబ్దపు సిటీకి కొత్త సంకేతం.
నేడు సీఎం శంకుస్థాపన
ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్పేటలో 7,29 ఎకరాల స్థలాన్ని ఎఫ్‌సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్‌సీడీఏ భవనానికి ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం భూమిపూజ చేయనున్నారు. ఆఫీసు నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.19 కోట్లు కేటాయించడంతోపాటు టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. రావిర్యాల (రతన్ టాటా) ఇంటర్ చేంజ్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు రూ.4,621 కోట్లతో 41.50 కి.మీ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు పనులకు చేయనున్నారు. అంబర్‌పేట్‌లో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను సైతం సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబర్‌పేట్ ఎస్టీపీతో సహా ఐదు ఎస్టీపీలను సైతం ప్రారంభించనున్నారు. వీటితోపాటు మూసీలోకి మురుగురాకుండా నివారించేందుకు కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీ పనులకు సైతం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.






