రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. న్యాయ నిపుణుల సలహా కోసమేనా?

by Muthe.Rajitha |   (  Updated:2025-08-24 14:07:55  IST  )

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. న్యాయ నిపుణుల సలహా కోసమేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకు సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా నేడు ప్రజా భవన్ లో సమావేశం అయిన స్థానిక ఎన్నికలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. ఈ వ్యవహారంలో న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.

అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండగా, ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ వ్యవహారంలో అసలు స్థానిక ఎన్నికలకు వెళ్లాలా? బిల్లు పెండింగ్ అంశంపై సుప్రీం తలుపు తట్టాలా అనే విషయంపై చర్చించేదనుకు సీఎం, మంత్రులు హస్తిన బాట పట్టనున్నారు.

Next Story