కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ!

by Kema Shiva Kumar |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ఉదయం 10.30కి శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు.

కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ఉదయం 10.30కి శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) రెండో దశ విస్తరణ పనులకు సంబంధింది DPR, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాలకు కేంద్ర స్థాయిలో మద్దతు పొందడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.

మరోవైపు వర్ష కాలం పంటలు సాగు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda)ను సీఎం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి కావాల్సన తక్షణ ఎరువుల కోటాను విడుదల చేయాలని రిక్వెస్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో ఈనెల 14న బహిరంగ సభ నిర్వహించబోతున్న సంగతి విదితమే. అయితే, ఈ సభకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)లను ఆహ్వానించనున్నట్లుగా సమాచారం. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పార్టీలో ఇటీవల నేతల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ చర్చిచనున్నారు.

Next Story