- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ (Delhi)కి చేరుకోనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామితో పాటు ధర్మపురి ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారికి కేటాయించే శాఖలపై చర్చించేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ (AICC) పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
అదేవిధంగా పార్టీ పదవుల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)తో సీఎం ఇటీవలే సమావేశమయ్యారు. ఆ పదవులపై కూడా ఈ టూర్‌లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. మరోవైపు కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద మునిసిపల్, పట్టాణాభివృద్ధి శాఖలతో పాటు హోం, విద్య, మైనారిటీ శాఖలు ఉన్నాయి. దీంతో వారికి అవే శాఖలు కేటాయిస్తారా..? లేక ఇప్పుడున్న మంత్రుల శాఖలకు కోత పెడతారా.. అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయ.






