CM Revanth Reddy : మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు.

CM Revanth Reddy : మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. అయితే ఈసారి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం సీఎం ఢిల్లీకి వెళుతున్నట్టు సమాచారం. ఆ కార్యక్రమం అనంతరం రెండు రోజులు పాటు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల(MLC Candidates) ఎంపికపై ఈ నెల 7, 8 తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక తుది రూపానికి వచ్చే అవకాశం ఉండటంతో.. అధిష్టానంతో సీఎం కీలక సమావేశంలో పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh kumar goud), రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(bhatti vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కోర్ కమిటీ మొత్తం ఢిల్లీలో అందుబాటులో ఉండడం వల్ల ఏఐసిసితో చర్చించి అభ్యర్థులు ఎంపికపై తుది నిర్ణయం తీసుకొనున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏఐసిసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్ద కోర్ కమిటీ సమావేశమయ్యింది. అభ్యర్థుల ఎంపిక విధి, విధానాలకు లోబడి ఉన్న ఆశావహుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అర్హులను సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించే విధంగా జాబితాను సిద్ధం చేసి ఏఐసిసికి నివేదించనున్నారు. ముఖ్యమంత్రితో కూడిన కోర్ కమిటీ నివేదించిన జాబితాను ఏఐసిసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

Next Story