CM Revanth Reddy: ఈ నెల 24న మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ సమావేశాల వేళ ఆసక్తికర పరిణామం

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

CM Revanth Reddy: ఈ నెల 24న  మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ సమావేశాల వేళ ఆసక్తికర పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్రం వద్ద ఆమోదింపచేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 24న ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించబోతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మల్లు రవి గురువారం ఉదయం ఢిల్లీకి రానున్న సీఎం, డిప్యూటీ సీఎంలు తొలుత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అవుతారని అదే రోజు సాయంత్రం ఏఐసీసీ జాతీయ కార్యాలయం ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ఎంపీలకు రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో అవలంభించిన విధానాలు, బీసీలకు 42 శాతం శాతం రిజర్వేషన్ల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంపీలను రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించనున్నట్లు వివరించారు.

ప్రధాని వద్దకు సీఎం?:

కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లుల (BC Reservation Bill) విషయంలో రేవంత్ రెడ్డి ప్రధానిని కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంథీతో కలిసి నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని కోరాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడే రెండు మూడు రోజులు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story