Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణలో రేపటి నుంచి సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaralu) ప్రారంభం కానున్నాయి.

Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaralu) ప్రారంభం కానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కాళేశ్వరం(Kaleswaram)లో మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రేపు ఉదయం 10:35 గంటలకు ప్రారంభోత్సవంలో పాల్గొని, సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్కర స్నానం ఆచరిస్తారు. ఈ 12 రోజుల పుణ్యకార్యక్రమం త్రివేణి సంగమం వద్ద (గోదావరి, ప్రాణహిత, అదృశ్య సరస్వతి నదుల సంగమం) జరుగనుండగా.. ఈ ప్రదేశాన్ని "దక్షిణ ప్రయాగ"(Dakshin Prayaga)గా పిలుస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్ల రూపాయలతో స్నాన ఘట్టాలు, రోడ్లు, శాశ్వత టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, 100 పడకల టెంట్ ఆసుపత్రి, హెలిప్యాడ్‌లతోపాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రోజువారీ సరస్వతి ఆరతి, దత్తాత్రేయ హోమం, రుద్ర హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు, కాశీ పురోహితుల నేతృత్వంలో పూజలు జరుగనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలాగే సరస్వతి పుష్కరాలు 2025 అనే యాప్, వెబ్‌సైట్‌ లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.

Next Story