నోవాటెల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం!?

by Veldandi saikiran |   ( Updated:2025-04-15 11:02:56.0  )
నోవాటెల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం!?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( cm revanth reddy) పెను ప్రమాదం తప్పింది. నోవాటెల్ లో (Novatel) సీఎం రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్టులో స్వల్ప అంతరాయం ఏర్పడింది. వాస్తవానికి 8 మంది ఎక్కాల్సిన లిఫ్టులో ( Lift)... ఏకంగా 13 మంది ఎక్కారు. ఓవర్ వెయిట్ కారణంగా ఆ లిఫ్టు మొరాయించింది. ఎక్కువమంది ఎక్కడంతో ఉండాల్సిన ఎందుకంటే కిందికి లిఫ్ట్ దిగింది.

దీంతో ఒక్కసారిగా అధికారులు టెన్షన్ పడ్డారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ ఓపెన్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ( cm revanth reddy) వేరే లిఫ్టులో పంపారు అధికారులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి నోవాటెల్ లో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్న నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed