MLC కవిత ఘోష్ కమిటీకి నివేదిక ఇచ్చుంటే బాగుండేది.. CM రేవంత్ సెటైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 14:55:43  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

MLC కవిత ఘోష్ కమిటీకి నివేదిక ఇచ్చుంటే బాగుండేది.. CM రేవంత్ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రీడిజైనింగ్ పేరుతో ఇష్టానుసారం కేసీఆర్ డిజైన్లు మార్చారు. అంచనా వ్యయం పెంచారు. అంత గొప్పగా నిర్మించినా.. మూడేళ్లకే కుంగిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే కాళేశ్వరం(Kaleshwaram)పై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినట్లే విచారణ చేయించాం. కాళేశ్వరం కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారని అన్నారు. ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు సహా అనేకమందిని పీసీ ఘోష్ విచారించారని అన్నారు. దాదాపు 16 నెలల తర్వాత 665 పేజీల నివేదికను కమిషన్ ప్రభుత్వాన్ని సమర్పించింది. ఆ తర్వాత రిపోర్ట్ అధ్యయనానికి ముగ్గురు అధికారులతో మరో కమిటీ వేశామని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలిపోయిందని కమిషన్ నిర్ధారించిందని చెప్పారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించిందని అన్నారు. త్వరలోనే అసెంబ్లీలో చర్చిస్తామని.. అంతకుముందే సభ్యులకు నివేదిక కాపీని అందజేస్తామని చెప్పారు. సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తప్పులు ఒప్పుకోకుండా మొండివాదన చేసేవారికి ప్రజలే మళ్లీ తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. పీసీ ఘోష్‌ను కాకుండా.. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఘోష్‌తో కమిటీ వేసి ఉంటే బాగుండేది అని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా.. కమిషన్‌ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామని.. అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు.

READ MORE ......

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం

Next Story