స్ట్రేచర్ అని విర్రవీగిన వాళ్లు స్ట్రెచర్ మీదకు వెళ్లారు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-12 11:25:40  IST  )

బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరోక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్ట్రేచర్ అని విర్రవీగిన వాళ్లు స్ట్రెచర్ మీదకు వెళ్లారు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరోక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘10 నెలలకే తనను అధికారం నుంచి దిగిపో అంటున్నారు.. పనిచేస్తుంటే కాళ్లు పట్టుకొని కిందకు లాగుతున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితే వచ్చి ఉండేది కాదు. నేను కూడా పోరాటం చేయాల్సి వచ్చేది కాదు’ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు.. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని గుర్తుచేశారు. ‘స్ట్రేచర్ ఉందని విర్రవీగారు.. స్ట్రెచర్‌పై పడ్డారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలని.. లేకపోతే స్ట్రెచర్ నుంచి మార్చురీలోకి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని.. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల వేతనాలు ఏనాడూ ఆలస్యం చేయడం లేదని అన్నారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలని అన్నారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని యువత భావిస్తే గత పాలకులు నిరుద్యోగులను, నియామక ప్రక్రియను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక పరిష్కారం దొరకలేదన్నారు. నిరుద్యోగుల ద్వారా గద్దెనెక్కిన గత పాలకులు అధికారంతో విర్రవీగుతుంటే నిరుద్యోగులంతా పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని అన్నారు.

Next Story