- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన CM రేవంత్
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏరియల్ సర్వే నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి నీటమునిగిన పంటపొలాలను వీక్షించారు. అనంతరం హన్మకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను కలిసి సమస్యల తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతులు స్వీకరించారు. బాధలు విని.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పరిశీలన ముగియడంతో తాజాగా హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
కాగా, మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. లక్షలాది ఎకరాల పొలాలు నీటమునిగాయి. వేలాది ఇళ్లలోకి వరద నీరు చేసింది. ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన బాధితులను సీఎం పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.






