- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నేతలపై జాలి చూపించిన CM రేవంత్.. ఎందుకో తెలిస్తే వారికి షాక్ తప్పదు?
బీఆర్ఎస్(BRS) నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టిన ధర్నాకు ఖర్గే, రాహుల్ గాంధీ రాలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు.. వారిని చూస్తే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఖర్గే, రాహుల్ ఇద్దరూ తెలంగాణ మోడల్‌ను ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) విషయంలో బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని సీరియస్ అయ్యారు. తాము ఢిల్లీ వేదికగా నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీసీలకు బీఆర్ఎస్ కనీస మద్దతు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణ తీసుకుంటుందని.. త్వరలోనే హైదరాబాద్ వేదికగా కీలక సమావేశం నిర్వహించబోతున్నామని కీలక ప్రకటన చేశారు.
అసలు బీజేపీ తప్పులను బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ నేతలు సపోర్ట్ చేస్తున్నారని.. ఇద్దరూ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రజెంటేషన్ ఇస్తాం.. ఆయన అనుమానాలన్నీ అధికారులు నివృత్తి చేస్తారని అన్నారు. ఇందుకోసం స్వయంగా కిషన్ రెడ్డే టైమ్, డేట్, ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలని సూచించారు. ఒక వేళ ఢిల్లీకి రమ్మన్నా తాము అధికారులను పంపిస్తామని అన్నారు.






