విమాన ప్రమాదంపై CM రేవంత్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-12 10:37:13  IST  )

గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.

విమాన ప్రమాదంపై CM రేవంత్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సులూ ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఘటన కలిచి వేసిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారంతా ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని కోరారు. బాధితులను మరియు వారి కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం త్వరితంగా మరియు సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు ఇప్పటికే ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సమీక్షించారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, రామ్మోహన్‌కు మోడీ ఫోన్ చేసి విమాన ప్రమాదంపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని ఆదేశించారు.

Next Story