- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ ప్రధాని అవ్వగానే.. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా బిల్లు పెడతాం: సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మూసీ ప్రక్షాళనకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం (Rajiv Gandhi Jayanti) రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్తమన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని అన్నారు. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని తెలిపారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుకుచేశారు.
18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే అవకాశం కల్పించారని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ అని కొనియాడారు. కంప్యూటర్‌ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు, టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు. రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణలో పాలన సాగుతోందని, ఈ సందర్భంగా ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. (Rahul Gandhi) రాహుల్ గాంధీ ప్రధాని అవ్వగానే 21 ఏళ్లు నిండిన వారు (MLA) ఎమ్మెల్యేగా పోటీ చేసేలా అసెంబ్లీలో బిల్లు పెడతామని హామీ ఇచ్చారు. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందేనని అన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమని తెలిపారు.






