వచ్చే మూడ్రోజులు ఉద్యోగులకు సెలవులు రద్దు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Ramesh Naini |

తెలంగాణకు భారీ వర్ష (Rains) సూచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే మూడ్రోజులు ఉద్యోగులకు సెలవులు రద్దు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు భారీ వర్ష (Telangana rains) సూచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాలు.. మరోవైపు భారీగా వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సీఎం (review) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే భారీ వర్షాల పట్ల ఇన్‌చార్జ్ మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

హైదారాబాద్‌తో పాటు వరద ప్రభావం ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలపై సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు. రాబోయే మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌తో సహా వరద ప్రభావిత జిల్లాల్లో నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Next Story