- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద సమస్యకు అదొక్కటే శాశ్వత పరిష్కారం.. అధికారులకు CM రేవంత్ ఆదేశం
హైదరాబాద్(Hyderabad)లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. చెరువులు, నాలాలు, ఇతర కాలువలు మూసీకి అనుసంధానం చేయాలని అన్నారు. మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలున్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Next Story






