- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: టీ స్క్వేర్ తెలంగాణ ఐకానిక్‍గా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఏఐ హబ్, టీ స్క్వేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ/డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఐకానిక్‌గా టీ స్వ్కేర్ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. నవంబర్ నెల చివరి వరకు వి-హబ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమాండ్ సెంటర్‌లో ఏఐ హబ్, టీ స్క్వేర్‍పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్‌రంజన్, సంజయ్‌కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక, టీఫైబర్ ఎండీ వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వి-హబ్ ఐకానిక్ బిల్డింగ్‍గా ఉండాలని సీఎం సూచించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, దీని నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్‍కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వి హబ్‍లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్‌లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని, వి హబ్ 24 గంటల పాటు పనియాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్‍లో భవనాలను పరిశీలించాలని సూచించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ఇందు కోసం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.






