- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : కాసేపట్లో విద్యా కమిషన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం సాయంత్రం తెలంగాణ విద్యా కమిషన్(Telangana Education Commission)తో భేటీ కానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం సాయంత్రం తెలంగాణ విద్యా కమిషన్(Telangana Education Commission)తో భేటీ కానున్నారు. మొదట విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం కానున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాఠశాల విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు, సర్కారు బడులను సంస్కరించేందుకు తెలంగాణ విద్యాకమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి(Akunuri Murali), కమిషన్ సభ్యులు.. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానంపై కీలక నివేదిక అందివ్వనున్నారు.
పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యా కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం విద్యావ్యవస్థలో తీసుకురానున్న పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై, వర్శిటీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి, వీసీల చర్చ జరగనుందని తెలుస్తోంది.






