- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డొస్తోంది.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం
వేతనాలు పెంచాలని గతకొన్ని రోజులుగా సినీ కార్మికులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వేతనాలు పెంచాలని గతకొన్ని రోజులుగా సినీ కార్మికులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫెడరేషన్ సభ్యులు, సినీ నిర్మాతలు పలుమార్లు చర్చలు జరిపినా కూడా సఫలం కాలేదు. దీంతో తాజాగా ఈ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) జోక్యం చేసుకున్నది. ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. సమ్మె ప్రభావం సినిమా పాలసీపై పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను సినిమా హబ్(Cinema Hub)గా మార్చాలని సర్కార్ ఆలోచిస్తుంటే.. ఇలా సమ్మెలతో ఇండస్ట్రీని చిక్కుల్లోకి నెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. కాగా, వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ సభ్యులు చేస్తున్న సమ్మెకు నేటితో 17 రోజులు గడిచింది. కొనసాగుతోన్న సమ్మె కారణంగా షూటింగులు పూర్తిగా నిలిచిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు, ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న తాము అంత పెంచలేమని నిర్మాతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తి నెలకొంది.






