- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sports Policy: తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్టస్ పాలసీ 2025 ని ఆవిష్కరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: క్రీడలను ప్రోత్సహించడం మా ప్రభుత్వ విధానం అని.. క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని-2025 (Telangana Sports Policy) తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ -2047 లో స్పోర్ట్స్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టామన్నామని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన 'ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్' (Telangana Sports Conclave) లో సీఎం పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(క్రీడలు ) ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో 'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ -2025' ను సీఎం విడుదల చేశారు. పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని చదువులోనే కాదు.. క్రీడల్లోనూ యువత రాణించాలన్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ నూతన క్రీడా విధానం తీసుకువచ్చామని.. కార్పొరేట్ రంగంలో సక్సెస్ రేటు ఉన్నవారు, క్రీడల్లో మెడల్స్ సాధించిన వారిని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వ్యవస్థలను నిర్వహించిన అనుభవం కలిగిన వారిని క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు చేసిందన్నారు.
దిశ దశా లేకపోవడం వల్లే..
ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపవడం వల్లే యువత వ్యసనాలకు బానిస అవుతున్నారని సీఎం చెప్పారు. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే మాదక ద్రవ్యాలు మన వైపు దూసుకు వస్తున్నాయన్నారు. పోరాట స్పూర్తి ఉన్న తెలంగాణ ప్రాంతం క్రీడల్లో రాణించాలని, ప్రపంచంతోనే పోటీ పడి దేశానికి గొప్ప పేరు తేవాలని తెలంగాణకు నూతన క్రీడా పాలిసీని తీసుకువచ్చామన్నారు. క్రీడామైదానాలు పెళ్లిళ్లు చేసుకునే ఫంక్షన్ హాళ్లుగా లేదా సన్ బర్న్ ఈవెంట్ చేసుకునే వేదికగా మారిందన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్, యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పారు. ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులు హైదరాబాద్ నుంచే ఉన్నారని సీఎం చెప్పారు. అజారుద్దీన్, రవితాం, వీవీఎస్ లక్ష్మణ్, సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తీ మనవాళ్లేనన్నారు. చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించడం వల్లే మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూశాక నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాను.. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోకపోవడం నిజంగా మన దేశానికి మన జాతికి అవమానంగా ఇది భావిస్తున్న. ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారత దేశం ఒలింక్ గేమ్స్ పతాకాల్లో 71వ స్థానంలో ఉండటం మనంతరం ఆలోచించాల్సిన సమయం అన్నారు. 2026లో ఖేలో ఇండియాను తెలంగాణను నిర్వహించాలని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయాను రిక్వెస్ట్ చేశామని తెలిపారు.






