CM Revanth Reddy: ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-07-07 08:32:45  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.

CM Revanth Reddy:  ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. మెట్రో రైలు విస్తరణ, అనుమతులు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు, నిధుల విషయాన్ని కేంద్ర మంత్రులతో కలిసి కోరనున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి తాజా పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించనున్నారు.

Next Story