- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారి హారిక వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ.. కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశాలు
వీధి కుక్కల దాడిలో గాయపడి కోమాలో ఉన్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపల్ కు చెందిన చిన్నారి హారిక వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వీధి కుక్కల దాడిలో గాయపడి కోమాలో ఉన్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపల్‌కు చెందిన చిన్నారి హారిక (Harika) వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు చిన్నారి తాత కొమ్ము రాందాసుతో అధికారులు స్వయంగా మాట్లాడారు. హారికకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కాగా రెండున్నరేళ్ల క్రితం హారిక తండ్రి చనిపోయారు. దాంతో హారిక తీసుకుని ఆమె తల్లి పుట్టింట్లో ఉంటోంది. ఆసమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా హారికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హారిక కోమాలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టు వెళ్లినా చిన్నారికి నయం కావడం లేదు. పేదరికంలో ఉన్న తమకు చిన్నారి వైద్య ఖర్చులు భరించే స్థితిలోలేమని హరిక తల్లి సిద్ద్వంతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి చిన్నారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.






