- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం జాతర అభివృద్ధి పనుల వీడియోను షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం మేడారంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహాజాతరకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో చకచకా పనులు పూర్తి చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మేడారంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహాజాతరకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో చకచకా పనులు పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జారత పనులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ...చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు…బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు వారి సంస్కృతి మన అస్థిత్వం.. వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర.. వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి… సమ్మక్క - సారక్క మనుషుల్లో దేవుళ్లు… ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి…వారి చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పం… మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సత్కార్యం.. అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్మిస్తున్న గద్దెల వద్దకు వెళ్లే ప్రవేశమార్గంలోని పిల్లర్లపై మేడారం సమ్మక్క సారలమ్మల చరిత్ర తెలిసేలా గర్తులను ముద్రించారు. అందులో ఒక్కో గుర్తు మేడారానికి సంబంధించిన ఒక్కో ప్రత్యేకతను చెప్పే తెలిపే విధంగా కనిపిస్తోంది. VIDEO






