- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర రాజకీయాలపై సీఎం రేవంత్ ఫోకస్: కులగణన సభకు ప్లాన్
కులగణనను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణను ఇప్పటికే రాహుల్‌గాంధీ అభినందించారు. ఇదిలా ఉండగా శనివారం పార్టీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి కలిసినట్టు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కులగణన పూర్తయిన సందర్భంగా సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై పార్టీ పెద్దలతో చర్చలు జరిపినట్టు టాక్. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనగణనతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కులగణన (Caste Census) చేపట్టిన విధానాన్ని, ప్రక్రియను సమావేశంలో రేవంత్ వివరించినట్టు సమాచారం. కులగణనను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణను ఇప్పటికే రాహుల్‌గాంధీ అభినందించారు. ఇదిలా ఉండగా శనివారం పార్టీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి కలిసినట్టు తెలిసింది. కులగణన పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్‌గాంధీని, రేవంత్‌రెడ్డిని అభినందించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు రాహుల్‌గాంధీ సమయం ఇవ్వాలని రేవంత్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. దీనితో పాటు పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి పలు అంశాలను చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా టాక్. ఢిల్లీలో వివిధ అనుమతులకు సంబంధించి ఢిల్లీ రెసిడెంట్కమిషనర్తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా తెలిసింది.






