- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ.. నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
by Ramesh Naini |
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి. నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి. నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడి గా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ (PV Narasimha Rao) పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






