- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jai Hind Rally : ప్రారంభం అయిన భారీ జైహింద్ ర్యాలీ.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(Hyderabad)లోని బాచుపల్లిలో "జై హింద్ యాత్ర(JaiHind Rally) కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని బాచుపల్లిలో "జై హింద్ యాత్ర(JaiHind Rally) కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొంటున్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీ(BJP)ని ఎండగట్టడం, భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ(Bharat-Pak Ceasefire)పై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ(PM Modi) తీరును విమర్శించడం, సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసీసీ(AICC) ఇచ్చిన పిలుపు మేరకు ఈ యాత్ర, సభను నిర్వహిస్తునారు. కాగా ఈ యాత్ర VNR కాలేజీ నుంచి KGR కన్వెన్షన్ వరకు సాగనుంది.
సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఎక్స్-సర్వీస్ మెన్ కమిటీ ఛైర్మన్ కల్నల్ రోహిత్ చౌదరి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర అనంతరం మధ్యాహ్నం KGR కన్వెన్షన్‌లో భారీ సభ నిర్వహించనున్నారు. జైహింద్ యాత్రకు మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు.






