CM Revanth Reddy: అందరూ సంతోషంగా ఉన్నారా? లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట

by Prasad Jukanti |

ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy:  అందరూ సంతోషంగా ఉన్నారా? లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్ష ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu) నిర్మిస్తున్నామని మరో రెండున్నరేళ్లలో మరో నాలుగు లక్షల ఇండ్లు ఇస్తామని ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో చంద్రుగొండ మండలం బెండాలపాడులో (Bendalapadu) నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఇందిరమ్మ ఇండ్లలోని గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు అందజేశారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలన్ ను సీఎం ఆవిష్కరించారు.

అందరూ సంతోషమేనా?:

ఈ సందర్భంగా అక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అందరు సంతోషంగా ఉన్నారా? పలకరించారు. సన్నబియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డులు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. మీ అందరి మొఖాల్లో సంతోషం కనిపిస్తోందని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని మధ్యలో పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో కరువు వచ్చిందన్నారు. మళ్లీ రాబోయే పదేళ్లు పేదళ్లందరికి ఇళ్లు నిర్మించుకుందామన్నారు. మీ పిల్లల పెళ్లిళ్లు అయితే వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన చెప్పారు. బీఆర్ఎస్ హాయంలో ఇదే రకంగా ఇండ్లు మంజూరు చేసి ఉంటే ఏడాదికి రెండు లక్షల ఇండ్ల చొప్పున రాష్ట్రమంతడా ఇప్పటికే 20 లక్షల ఇండ్లు అవుతుండే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని కేసీఆర్ చెప్పి ఇవ్వలేదన్నారు.

Next Story