- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారం
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రేవంత్ నివాళులు అర్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది..అది కుటుంబ సంబంధం కంటే ఎక్కువ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంతవరకు ప్రజలు గాంధీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారని ఆయన తెలిపారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకు రావాలని, తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని సీఎం ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి సాంకేతికను పరిచయంచేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, దేశంలోసాంకేతికతను తీసుకొచ్చిన గొప్ప దార్శనీకుడు అని సీఎం కొనియాడారు. దేశంలో మహిళా రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిన గొప్ప దార్శనికుడు అని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.






