- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ రెడ్డి న్యూలుక్.. మంత్రులతో కలిసి త్రివేణి సంగమానికి!
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు(Pushkaralu 2025) గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు(Pushkaralu 2025) గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలిరోజు కావడంతో రాష్ట్ర మంత్రి మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి చేరుకున్నారు. ఎప్పుడూ వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్ వేసే సీఎం.. గోధుమరంగు కలర్ కుడ్తాలో వచ్చారు. ఈ న్యూలుక్ అందరినీ ఆకట్టుకున్నది. సీఎం రేవంత్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా.. ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతోపాటు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. ప్రతిరోజు సగటున లక్షన్నర మంది వస్తారని దేవాదాయశాఖ అంచనా వేసింది. పుష్కరాల నేపథ్యంలో నదీ జలాలు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారుల్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.






