CM Revanth Reddy: తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. భావోద్వేగం: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కోటి రతనాలు వీణ.. నా తెలంగాణ అని కవి దాశరథి (Dasharathi) ముమ్మాటికీ సత్యమని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. భావోద్వేగం: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కోటి రతనాలు వీణ.. నా తెలంగాణ అని కవి దాశరథి (Dasharathi) ముమ్మాటికీ సత్యమని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమని తెలిపారు. ఆ అస్తిత్వానికి మూలం మన సంస్కృతేనని అందుకు ప్రతిరూపం తెలంగాణ తల్లి (Telangana Thalli) అని అన్నారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో సకల జనులను ఐక్యం చేసింది ఆ ప్రతిరూపమేనని తెలిపారు. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రాహాలకు అధికారిక గుర్తింపు లేదని.. తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story