అజిత్ పవార్ మృతి మహా రాజకీయాల్లో తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దేశ రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది.

అజిత్ పవార్ మృతి మహా రాజకీయాల్లో తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దేశ రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. ఆయన మృతదేహాన్ని తరలించిన ఆస్పత్రి వద్ద భారీ ఎత్తున పార్టీ నేతలు, ప్రజలు చేరుకున్నారు. తమ నేతను కోల్పోవడంతో కంటతడి పెట్టుకుంటున్నారు. అజిత్ పవార్ మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేతలు సంతాపం తెలిపారు.

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. బారామతిలో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించడం ఎంతో బాధాకరమని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని, అజిత్ పవార్ మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అజిత్ పవార్ మృతిపట్ల సంతాపం తెలిపారు. రైతు ఉద్యమనేతగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి ఎంతో ఎదిగారని, కీలక నేతకు ఇలాంటి మరణం రావడం కలచివేసిందన్నారు. ప్రజలతో అజిత్ పవార్ కు ఎంతో అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు. పవార్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Next Story