- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో (Piyush Goyal) సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్తగా అనుకుంటున్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే విదేశాల నుంచి ముడి సరుకులు దిగుమతుల విషయంలోనూ వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ముడిసరుకులు సకాలంలో రాకపోవడం వల్ల తెలంగాణలోని పరిశ్రమల ఉత్పత్తులు తగ్గిపోతున్నదని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నదని అందువల్ల ముడిసరుకుల దిగుమతుల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి రావాల్సిన ముడిసరుకుల విషయంలో వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పీయూష్ గోయల్ తో భేటీ సందర్భంగా సీఎం వెంట ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ట్రానికి యూరియా సరఫర విషయంలో విజ్ఞప్తి చేశారు. అలాగే ఇవాళ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ అశ్వినీ వైష్ణవ్ తండ్రి మరణంచడంతో వీరి భేటీ రద్దయింది. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి రేపు మరి కొంత మంది కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధికారులు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి సీఎం తన ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి తెలంగాణకు చేరనున్నట్లు సమాచారం.






