- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ ఉన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ ఉన్నారు. ఇవాళ ఆయన కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ముందుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ ఆయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని వినతి అందజేశారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. YIIRSలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం తెలిపారు. YIIRSల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి కోరారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రితో సమావేశం
అనంతరం హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం భేటీ అయ్యారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి తెలిపారు.






