- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh)ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వయంగా ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి పూలగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలకు న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం ద్వారా మరింత మెరుగైన సేవలు అందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ప్రతి ఏటా నూతన సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి మర్యాదపూర్వక భేటీలు జరగడం సంప్రదాయంగా వస్తోంది. కాగా వీరి బేటికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.






