Lok Bhavan: లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు.

Lok Bhavan: లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గవర్నర్‌కు ఆయన సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రజలందరికీ సీఎం విషెస్..

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా రూపొందించిన విజన్‌-2047 లక్ష్యాలను సాధించేందుకు మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో తెలంగాణను వేగవంతమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story