- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : హుటాహుటిన ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ(Delhi)కి పయనమయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ(Delhi)కి పయనమయ్యారు. పార్టీ అదిష్ఠానం పిలుపుతో ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా సమాచారం. ఆయన పర్యటన శుక్రవారం మధ్యాహ్నం వరకు లేదని, మధ్యాహ్నం తరువాత ఖరారు అయినందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ కార్యకమాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లుగా సమాచారం. ఇందులో ప్రధానంగా కుల గణన(Cast Census)లో పాల్గొనని వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఈనెల 16 నుంచి 28 ప్రత్యేక సర్వే, సర్వే పూర్తి అయ్యాక దానికి చట్టబద్దత కల్పించి దానిని కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినెటెడ్పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలిసింది. దీనితో పాటుగా మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో అనేక సందర్భాల్లో సీఎం తో పాటుగా పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ, ఉత్తమ్ లాంటి వారిలో ఒకరు తప్పనిసరిగా ఢిల్లీ పెద్దలు పిలిపించి మాట్లాడే వారు కానీ ఈ సారి మాత్రం కేవలం సీఎం రేవంత్‌రెడ్డినే పిలిపించడం ఎంటనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.






