CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-03-24 10:00:42  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి (Delhi Tour) బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన వీరు ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ వెనుక ప్రధాన ఎజెండా మంత్రివర్గ విస్తరణ అని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అధిష్టానం ఇవాళ తుదినిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Next Story