- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపు సీడబ్ల్యూసీ మీటింగ్
by Ramesh Naini |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరారు. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరారు. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో రేపు (శనివారం) ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు, పార్టీ కీలక నాయకులు పాల్గొననున్నారు.
Next Story






